బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2023 (12:41 IST)

ఒంటరి అభిమన్యుడిగా నువ్వు మిగిలిపోవచ్చు: ఓడిపోయిన రఘునందన్ కామెంట్

raghunandan rao
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి దెబ్బైపోయి పరాజయం పాలైన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ట్విట్టర్లో ఆసక్తికర కామెంట్ చేసారు. తన ఓటమికి కారణం గురించి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో మహాభారతంలో పద్మవ్యూహంలోకి వెళ్లి వీరమరణం చెందిన అభిమన్యుడి కథను రాసారు. మరి.. ఆ ప్రకారం ఆయన పోటీలో ఒంటరిగా మిగిలి ఓటమిపాలయ్యారా.. ఆయనకు వెన్నుదన్నుగా ఎవరూ నిలవలేదా... మన అనుమానాలు ఎలా వున్నా, రఘునందన్ రావు వ్యాఖ్యలు అర్థం ఏమిటో, ఈ ట్వీట్ చూడండి.