బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 నవంబరు 2023 (19:44 IST)

ఆ ఇద్దరితో జాగ్రత్త: ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం

Narendra Modi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగుకి మరో 2 రోజులే మిగిలి వుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు తెలంగాణలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్‌లో జరిగిన సకల జనుల విజయసంకల్ప సభలో భరోసా ఇచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు ట్రైలర్ చూపించాం, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని మోదీ అన్నారు. కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలనుద్దేశించి తెలుగులో మాట్లాడారు.