సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (10:11 IST)

దుబ్బాకలో ఒకే తాడుకు ఉరేసుకున్న ప్రేమజంట

lovers hang
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఒకే తాడుకు ఉరేసుకుంది. ఈ విషాదకర ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబ్బాకకు చెందిన మైనర్ బాలిక ఒకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు లచ్చాపేటకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దుబ్బాకలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమలో బుధవారం మైనర్ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఒకే తాడుకు వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరూ ఉరితాడుకు వేలాడుతుండటాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.