1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జులై 2023 (12:46 IST)

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య ... ఎక్కడ?

suicide
సాధారణంగా భర్తతో పాటు అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేకు మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భార్య, ఆమె తల్లిదండ్రులు పెట్టిన వేధింపులను భరించలేని భర్త ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోచమ్మ గుడి వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు వెంకట్ రెడ్డి. ప్రైవేటు ఉద్యోగి. 
 
ఈయనకు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్ రెడ్డి తల్లితో కూడా ఆయనతో పాటే నివసిస్తోంది. ఇటీవల కాలంలో వేరు కాపురం విషయంలో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో, భార్య అలిగి రెండు నెలల క్రితం వరంగల్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 2న తల్లిదండ్రులను తీసుకుని భర్త ఇంటికొచ్చి గొడవకు దిగింది. అత్తను ఇంటినుంచి పంపించాలని, ఆస్తి పిల్లల పేరున రాయాలని ఒత్తిడి తెచ్చింది.
 
ఈ విషయమై ఆమె పెడబొబ్బలు పెడుతుంటే విషయం బయటవారికి తెలిసి కుటుంబ పరువు పోతుందని వెంకట్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యారు. వద్దని చెప్పినా భార్య వినకపోవడంతో చచ్చిపోతానని హెచ్చరించాడు. అయితే, ఇదంతా డ్రామాలని, అతడు చచ్చేది లేదని అత్తమామలు భార్య హేళన చేయడంతో వెంకట్ రెడ్డి అదే రోజున పురుగుల మందు తాగాడు. తల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.