గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (12:33 IST)

పవన్ కల్యాణ్- అన్నా లెజ్నోవా విడాకులు తీసుకున్నారా?

Pawan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-ఆయన మూడో భార్య అన్నా లెజ్నోవా విడిపోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నాతో పవన్ కల్యాణ్‌కు వివాహం జరిగి పదేళ్లైంది. పవన్-అన్నా ఇప్పటికే విడిపోయారని.. అన్నా పిల్లలతో పాటు రష్యాకు వెళ్లిపోయారని టాక్ వస్తోంది. ఈ ఆరోపణలపై పవన్, అన్నా ఇంకా స్పందించలేదు.
 
పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజ్నోవా ఇంకా చట్టబద్ధంగా కాకపోయినా సామాజికంగా విడిపోయారని టాక్ వస్తోంది. పవన్‌తో తరచుగా కనిపించే అన్నా లెజ్నోవా, గత నెలలో జరిగిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో కనిపించలేదు. 
 
పవన్ వారాహి యాత్ర ప్రారంభానికి ముందు జరిగిన యాగంలో కూడా ఆమె కనిపించలేదు. పవన్ తనతో పాటు వారి పిల్లలతో వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలపై పవన్ ఇంకా స్పందించలేదు. 
 
ఇకపోతే.. 2011లో తన తీన్ మార్ సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ అన్నను కలిశారు. అన్నా ఆ సమయంలో రష్యన్ మోడల్, నటి. అప్పుడే ఈ జంట ప్రేమలో పడింది. సెప్టెంబర్ 30, 2013న పెళ్లి చేసుకున్నారు. 
 
అన్నాకు అప్పటికే తన మొదటి వివాహం నుండి పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉండగా, పవన్- అన్నా 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొడుకును స్వాగతించారు. పవన్ గతంలో నందిని, రేణు దేశాయ్‌లను వివాహం చేసుకున్నారు. నందినిని 1997లో వివాహం చేసుకున్న పవన్.. ఆమెకు 2008లో విడాకులు ఇచ్చారు. 
 
2001లో పవన్ రేణుతో సహజీవనం చేశారు. 2004లో వీరికి అకీరా పుట్టాడు. పవన్, రేణు 2009లో వివాహం చేసుకున్నారు. ఆపై వీరికి ఆద్య పుట్టింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ 2012లో ఈ జంట విడిపోయింది.