సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2023 (20:28 IST)

ఆరు నెలల క్రితమే రెండో పెళ్లి, భాజపా నాయకురాలిని హత్య చేసి కాలవలో పడేసిన భర్త

sana
కర్టెసీ-సోషల్ మీడియా
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ నాయకురాలు సనా ఖాన్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హత్యకు గురయ్యారు. దాబా నడుపుతున్న ప్రధాన నిందితుడు సనా భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యలో మరో ఇద్దరి పాత్ర వున్నట్లు తేలడంతో సనా భర్తతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కేసు వివరాలను పరిశీలిస్తే... నాగ్‌పూర్ బీజేపీ ఆఫీస్ బేరర్ సనా అలియాస్ హీనా ఖాన్ ఆగస్ట్ 1 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. సనా ఖాన్ ఆగస్ట్ 1న జబల్పూర్ వచ్చింది, ఆ తర్వాత ఆమె జాడ తెలియలేదు. కేసు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేశారు. హత్య చేసింది సనా భర్త అమిత్ సాహు అలియాస్ పప్పుని అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
 
నాగ్‌పూర్‌లోని మనక్‌పూర్ నివాసి సనా, అమిత్ సాహును 6 నెలల క్రితమే వివాహం చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. సనా ఓ బిడ్డకు తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనాఖాన్‌ను హత్య చేసి మృతదేహాన్ని హిరాన్ నదిలో పడేసినట్లు ప్రధాన నిందితుడు విచారణలో తెలిపాడు. నిందితులు చెప్పిన ఆచూకి ప్రకారం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మృతదేహం లభ్యం కాలేదు. ఈ హత్యలో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరి హస్తం ఉందని పోలీసులు తెలిపారు. జబల్‌పూర్‌లోని ఘోడా బజార్ ప్రాంతంలో ముగ్గురిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు.