బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (08:46 IST)

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... ఏడుగురి మృతి

bus - sagar canal
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఒకటి నాగార్జున సాగర్ కుడి కాలువలో బోల్తాపడింది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సాగర్ కెనాల్‌లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హానీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)లుగా గుర్తించారు.