శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:24 IST)

వనపర్తి జిల్లాలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

tsrtcbus accident
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అయితే, అందరికీ స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జాతీయ రహదారి ఎన్.హెచ్.44 రోడ్డుపై జరిగింది. 
 
కొత్తకోట బైపాస్ సమీపంలో యాదగిరి గుట్టకు చెందిన ఆర్టీసీ బస్సు టీఎస్ 30 జడ్ 0015గా గుర్తించారు. ఈ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. యాదగిరి గుట్ట నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ, అతని బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.