1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (19:57 IST)

ఇ-రేస్ ఈవెంట్... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారా బ్రాహ్మణి

Nara Bramhani
Nara Bramhani
భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఇ-రేస్ ఈవెంట్ ఇటీవల హుస్సేన్ సాగర్ - ఎన్టీఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు క్రీడాభిమానులతో పాటు వీఐపీల వరకు పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్ అయ్యిందని తెలంగాణ సర్కారు పేర్కొంది. 
 
వరుసగా రెండు రోజులు ఈవెంట్‌లో కనిపించిన వీఐపీలలో ఆమె ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఒకరు. 
 
ఇంతకుముందు చాలామందికి తెలియని రేసింగ్ ఈవెంట్‌లపై ఆమె ఆసక్తిని ఇది చూపించింది. నారా బ్రాహ్మణి బహుముఖ ప్రజ్ఞావంతురాలు, ఇటీవల లేహ్-లడఖ్‌లో ఆమె బైక్ ట్రెక్కింగ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
నందమూరి హీరో బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణి విజయవంతమైన వ్యాపారవేత్త, డెయిరీ మేజర్ హెరిటేజ్ ఫుడ్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. నారా బ్రాహ్మణి రేసింగ్ వంటి సాహస క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. 
 
ప్రస్తుతం ఇ-రేస్ ఈవెంట్‌లోనూ అదరగొట్టారు. ఈ ఈవెంట్‌కు నారా బ్రాహ్మణితో పాటు ఆమె కుమారుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి కూడా హాజరయ్యారు.