శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (16:39 IST)

బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వ్యభిచార కేంద్రం (Video)

సాధారణంగా ముస్లిం దేశాల్లో వ్యభిచారం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు. వ్యభిచార వృత్తిలో పట్టుబడిన వారికి విధించే శిక్షలు కఠినాతికఠినంగా ఉంటాయి. అయితే, ముస్లిం దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌లో అతిపెద్ద

సాధారణంగా ముస్లిం దేశాల్లో వ్యభిచారం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు. వ్యభిచార వృత్తిలో పట్టుబడిన వారికి విధించే శిక్షలు కఠినాతికఠినంగా ఉంటాయి. అయితే, ముస్లిం దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వ్యభిచారం కేంద్రం నడుస్తోంది. దౌలాతియా అనే ప్రదేశంలో ఉన్న ఈ కేంద్రం ఏకంగా 1500 మంది వ్యభిచారిణులు ఉన్నారు. వీరిలో పదేళ్ళ బాలికలు కూడా ఉన్నారు. 
 
ఇక్కడ రాత్రిపగలు అనే తేడా లేకుండా విటులు వచ్చిపోతుంటారు. దీంతో ఈ ఏరియా నిత్యం అత్యంత రద్దీగా కనిపిస్తోంది. ఇక్కడ వ్యభిచార వృత్తిలో నిమగ్నమైవుండేవారిలో కొందరు పొట్టకూటి కోసం పడుపు వృత్తిలోకి వచ్చేవారు కొందరైతే... మరికొందరు తల్లిదండ్రులు ఆడపిల్లను అంగట్లో సరుకుగా భావించి ఈ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యభిచార కూపానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షల మంది పైచిలుకు నెటిజన్లు వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.