1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. China conducts world's 1st remote surgery using 5G

5జీ సాంకేతికతతో చైనా వైద్యుల ఆపరేషన్.. అరుదైన ఘనత సాధించారు..

China
చైనా వైద్యులు అత్యంత అరుదైన ఘనత సాధించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తున్న చైనా.. మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బీజింగ్‌లోని రోగికి హైనస్ ద్వీపం నుంచి ఆపరేషన్ చేశారు చైనా వైద్యులు. ఇందుకు గాను హువాయి 5జీ సాంకేతిక సహకరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వున్న రోగికి, మెదడు సంబంధిత శస్త్రచికిత్స జరుగుతుండగా, ఆపరేషన్ థియేటర్‌కు రాలేకపోయినా.. డాక్టర్ దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో శస్త్రచికిత్సను పూర్తి చేశాడు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ హవాయీ తయారు చేసిన 5జీ సాంకేతికతతో అనుసంధానమైన కంప్యూటర్, రోబోట్ల ద్వారా ఈ పని పూర్తయింది.
 
ఈ విధంగా ఓ ఆపరేషన్ జరగడం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లింగ్ జీపీ అనే వైద్యుడు ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో వున్న అన్ని పరికరాలను బీజింగ్‌కు చాలా దూరంలోని హైనన్ ద్వీపం నుంచి ఆపరేట్ చేస్తూ, రోగి మెదడులోకి బ్రెయిన్ పేస్ మేకర్ ను ఎక్కించే పనిని పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగికి స్వాంతన లభించింది.
తర్వాతి కథనం
మా కుటుంబంలో ఒకర్నొకరు చంపుకునేంత గొడవలు లేవు : వైఎస్ వివేకా కుమార్తె