శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (14:40 IST)

షాకింగ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ పేలి కంపెనీ సీఈవో మృతి

ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ పేలి ఓ కంపెనీ సీఈవో మృత్యువాతపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మలేషియాలో ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్స్‌ అనే క్రెడిల్ ఫండ్ కంపెనీ ఉంది. దాన

ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ పేలి ఓ కంపెనీ సీఈవో మృత్యువాతపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మలేషియాలో ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్స్‌ అనే క్రెడిల్ ఫండ్ కంపెనీ ఉంది. దానికి నజిరిన్ హుస్సేన్ అనే వ్యక్తి సీఈవోగా పని చేస్తున్నారు. ఈ కంపెనీ మలేషియన్ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం చేయటంలో క్రెడిల్ కంపెనీకి మంచి పేరు ఉంది.
 
ఈయన రెండు రోజుల క్రితం చనిపోయారు. ఎలా అంటే తన స్మార్ట్ ఫోన్ పేలటం వల్లే. యేడాదికి కోట్లలో జీతం తీసుకునే ఓ సీఈవో.. స్మార్ట్ ఫోన్ పేలి చనిపోవటం ప్రతి ఒక్కరినీ షాకింగ్‌కు గురిచేస్తోంది. 
 
నజిరిన్ హుస్సేన్‌కు రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాక్ బెర్రీ, మరొకటి హువాయ్ ఫోన్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆయన.. తన బెడ్రూమ్‌లో ఛార్జింగ్ పెట్టారు. ఆ తర్వాత నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ పేలింది. ఆ వెంటనే గది అంతా మంటలు వ్యాపించాయి. 
 
గదిలో ఎక్కువగా సోఫాలతోపాటు అత్యంత ఖరీదై బెడ్స్ ఉండటంతో నిమిషాల్లోనే మంటలు గదిని చుట్టుముట్టాయి మంటలు. అందులో నుంచి బయటకు రాలేకచనిపోయారు. బ్యాటరీ ఓవర్ హీట్ వల్లే ఫోన్ పేలిపోయిందని.. అయితే పేలిన ఫోన్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు.