న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ ఆదివాసీ మహిళ సిండీ కైరో
Cindy Kiro
అక్టోబరు నుండి సిండీ కైరో ఐదేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుంది. పాస్తీ రెడ్డి స్థానంలో తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత మావోరి బాలికలను స్ఫూర్తిపరిచేలా చర్యలు తీసుకుంటానని ఆమె ప్రకటించారు. తన మావోరి, బ్రిటీష్ మిశ్రమ వారసత్వం దేశ చరిత్రను మరింత బాగా అవగాహన చేసుకోవడానికి సహాయపడిందని కైరో పేర్కొన్నారు.
ప్రస్తుతం కైరో స్వచ్ఛంద సంస్థ రాయల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వున్నారు. గతంలో బాలల కమిషనర్‌గా కూడా ఆమె పనిచేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. బాలలు, యువత సంక్షేమం పట్ల ఆమె కృషి ఎనలేనిదని ప్రధాని జసిండా కొనియాడారు.
తర్వాతి కథనం
