సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (19:13 IST)

ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా భారత సంతతి యువతి

Anvee Bhutani
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అన్వీ భుటానీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ జరిగిన ఎన్నికల్లో భూటానీ ఈ ఘనత సాధించింది. 
 
కాగా గత ఫిబ్రవరిలో వర్శిటీలో విద్యార్థి ఎన్నికలు జరిగగా..ఈ ఎన్నికల్లో భారత విద్యార్థిని రష్మీ సమంత్ గెలుపొందారు. కానీ రష్మీ సుమంత్ విద్యార్థి సంఘం నాయకురాలిగా తప్పుకుంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక జరిగింది.
 
ఈ ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ స్థాయిలో పోటీ పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ అన్వీ భుటానీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
అన్వీ ప్రస్తుతం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్ డాలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్సెస్ లో పీజీ చదువుతున్నారు. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.