1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Earthquake in Japan

జపాన్‌లో భూకంపం

Earthquake
కరోనా వైరస్ కల్లోల సమయంలో జపాన్ దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని మియాగీ ప్రాంతంలో ఉదయం భూకంపం సంభవించిందని జపాన్ అధికారులు చెప్పారు.

ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైందని జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం ప్రభావం టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా ప్రభావితమైంది.

ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
భారత్‌ లో కరోనా విజృంభణ.. 24గంటల్లో 1553 కొత్త కేసులు