1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Flydubai hero pilot tells Netanyahu new details about cockpit attac

ప్రార్థన చేసుకుంటానని నమ్మంచి వెనుక నుంచి దాడి చేశాడు : ఫ్లైదుబాయ్ కెప్టెన్

Pilot Smit Machchhar
కెప్టెన్ స్మిత్ మచ్చర్ చెప్పిన వివరాల ప్రకారం, విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ప్రార్థన చేయాలని కోరాడు. దీనికి కెప్టెన్ అంగీకరించి, గౌరవపూర్వకంగా తన దృష్టిని ముందు వైపు కేంద్రీకరించారు. నాలుగైదు నిమిషాల తర్వాత, ఉన్నట్టుండి తన తల వెనుక భాగంపై బలమైన దెబ్బ తగిలింది. మొదట విమానానికి ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందని భావించానని, కానీ దెబ్బలు కొనసాగడంతో తన పక్కనే ఉన్న కో-పైలటే దాడి చేస్తున్నాడని గ్రహించానని మచ్చర్ వివరించారు.
 
తీవ్ర గాయాలతో కంటిచూపు మసకబారినా, ఎలాగైనా కాక్‌పిట్ తలుపు తెరిచి బయట ఉన్నవారిని అప్రమత్తం చేయాలని ప్రయత్నించారు. మొదటిసారి తలుపు తెరిచినా కో-పైలట్ దాన్ని మూసేశాడు. నేలపై పడి ఉన్న సమయంలో విమానం వేగంగా కిందికి దిగుతున్న శబ్దాలు, ప్రయాణికుల అరుపులు వినిపించాయని ఆయన చెప్పారు. 
 
'నాలో ఇంకా చివరి పోరాటం మిగిలి ఉందని భావించాను. ఇప్పుడు పోరాడకపోతే చనిపోతానని అనిపించింది' అని చెప్పిన మచ్చర్, రెండోసారి తన పూర్తి శక్తిని కూడదీసుకుని తలుపు తెరిచారు. వెంటనే విమాన సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనను యూఏఈ అధికారులు ఉగ్రవాద ప్రయత్నంగా అభివర్ణించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం కెప్టెన్ స్మిత్ మచ్చర్ యూఏఈలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సాయం చేస్తానంటూ నమ్మించి యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీ (Video)