భారత పైలెట్ సాహసంతో మరో 9/11 తరహా పెను ప్రమాదం తప్పింది : నెతన్యాహు
ఫ్లైదుబాయ్ FZ1073 కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్.. విమానం కూలిపోకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. కో-పైలట్ దాడిలో మచ్ఛర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ విమానాన్ని కాపాడేందుకు ఆయన చేసిన చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
అలాగే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్, ప్రయాణికులు కలిసి పెను ప్రమాదాన్ని తప్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విమానం ఒక్కసారిగా తీవ్రంగా కిందికి దిగుతున్న సమయంలో ప్రయాణికుడు యానివ్ హయూన్‌తో పాటు మరికొందరు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఒకవేళ ఇది జరిగి ఉండకపోతే, ఈ ఘటన 'మరో 9/11' తరహా పెను ప్రమాదానికి దారితీసి ఉండేదని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
