1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Kim Jong Un denounces US as ‘terrorist’ state in apparent reference to Iran war

అమెరికా ఓ ఉగ్రవాద దేశం... నిప్పులు చెరిగిన కిమ్ జాంగ్ ఉన్

kim zong un
అగ్రరాజ్యం అమెరికాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిప్పులు చెరిగారు. అమెరికాను ఓ ఉగ్రవాద రాజ్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా దేశ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగిస్తున్నది అమెరికా సైనిక విధానాలేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
కిమ్ ప్రసంగంలో పేర్కొన్న కీలకాంశాలను పరిశీలిస్తే, ఉత్తర కొరియా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని స్పష్టం చేశారు. అణు సామర్థ్యం అనేది దేశ భద్రతకు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. నేరుగా ఇరాన్ పేరు ఎత్తనప్పటికీ, పశ్చిమాసియాలో అమెరికా సాగిస్తున్న దాడులను కిమ్ తప్పుబట్టారు. శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు.
 
అదేసమయంలో పొరుగు దేశం దక్షిణ కొరియాను తమ దేశానికి ఉన్న అతిపెద్ద శత్రువుగా కిమ్ అభివర్ణించారు. సియోల్ గనుక తమ సరిహద్దులను ఉల్లంఘిస్తే నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కలవాలనుకుంటున్నారనే వార్తలపై కిమ్ కిమ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. గత అనుభవాల దృష్ట్యా అమెరికా చర్చలక కంటే ఆయుధాల బలోపేతంపైనే తాము దృష్టి పెడతామని ఆయన స్పష్టమైన సంకేతాలను పంపించారు. 
తర్వాతి కథనం
ఘజియాబాద్‌లో దారుణం.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ..