1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Kurchi Madatha Petti Dance Steps in Nepal

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

Kurchi Madatha Petti Dance
Kurchi Madatha Petti Dance
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఫ్లాప్‌ అయినా అందులోని పాటలకు మంచి స్పందన వచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ముఖ్యపాత్రలో నటించిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్‌ అయ్యింది. 
 
యూట్యూబ్‌ అధికారికంగా విడుదల చేసిన టాప్ సాంగ్స్ జాబితాలో భారత్ నుంచి కుర్చీ మడత పెట్టి మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటను తెగ చూశారని యూట్యూబ్‌ ట్రెండ్స్ చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వీడియో వైరల్‌ అయ్యింది.
 
రోడ్డు పక్కన ఇద్దరు అమ్మాయిలు కుర్చీ మడత పెట్టి పాటకు వేసిన డాన్స్ స్టెప్పులు మరింతగా వైరల్‌ అయ్యాయి. వారిద్దరూ చాలా గ్రేస్‌తో డాన్స్ వేసిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోలను తెగ షేర్‌ చేస్తూ తమన్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు.
 
ఇకపోతే.. కొన్ని రోజుల క్రితం నేపాల్‌కి చెందిన 40 నుంచి 50 మంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కుర్చీ మడత పెట్టి పాటకు వేసిన డాన్స్ వైరల్‌ అయ్యింది. రోడ్డు మీద వారు డాన్స్ చేస్తూ ఉంటే అంతా నిల్చుని మరీ చూశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...