ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (10:09 IST)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

Mahesh Babu,   Priyanka Chopra
Mahesh Babu, Priyanka Chopra
ఇటీవలే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. అదే రోజు ఓ సినిమా ఫంక్షన్ ను హాజరయిన రాజమౌళిని యాంకర్ సుమ సినిమా గురించి అడిగితే, స్టేజీ మీద కాదు. పర్సనల్ గా మాట్లాడదాం అని సరదా కౌంటర్ వేశారు. అయితే తాజా సమాచారం మేరకు రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ హైదరాబాద్ ఫిలింసిటీలో ప్రారంభమైంది. దాదాపు 20రోజులపాటు అక్కడ షూటింగ్ జరగనుంది.
 
John Abraham
John Abraham
తొలుత అక్కడ టెంపుల్ లో మూడు రోజులుగా షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కూడా పాల్గొన్నారు. ప్రియాంక చాలా కాలం తర్వాత తెలుగులో సినిమాలో నటించడం విశేషం. ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్ ను సందర్శించుకున్న ప్రియాంక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా, 20రోజుల షూటింగ్ ఇక్కడ జరుపుకున్న తర్వాత కెన్యాలోని అడవీ ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. విదేశాలకు ఇబ్బందులు లేకుండా షూటింగ్ జరిగేందుకు తాను వీసాదేవుడు దగ్గరకు వచ్చినట్లు సూచాయిగా తెలిపింది.
 
మహేష్ బాబుకు 29 సినిమాగా పాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి రూపొందించడంతో ఈ సినిమాలో బాలీవుడ్ మోడల్, నటుడు జాన్ అబ్రహం నటిస్తున్నారు. తను హైటెక్ విలనా? కాదా? అనేది త్వరలో తెలియనుంది. ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇది వరల్డ్ కథ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే తెలియజేశారు. కెన్యాతోపాటు పలు ప్రాంతాల్లో లొకేషన్లను కూడా గతంలో రాజమౌళి చూసి వచ్చారు. ట్విస్ట్ ఏమంటే, ప్రపంచవింతల్లో రెండు వింతల చోట్ల షూటింగ్ జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.