బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (09:47 IST)

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

Naga Chaitanya, Sai Pallavi
Naga Chaitanya, Sai Pallavi
'తండేల్' థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా జనవరి 23న రిలీజ్ కానుంది. సముద్ర తీరంలో రగ్గడ్ లుక్ లో లవ్లీ స్మైల్ తో నిలుచుకున్న నాగచైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్ గా డ్యాన్స్ చేస్తూ సాయి పల్లవి కనిపించిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
 
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్  సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. రీసెంట్ గా రిలీజైన సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" సెన్సేషన్ క్రియేట్ చేసింది. షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌.  శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.