సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జనవరి 2025 (19:08 IST)

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

Shiva Shakti Song Namo Namah Shivaya
Shiva Shakti Song Namo Namah Shivaya
నాగ చైతన్య  'తండేల్' నుంచి సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ"  లిరికల్ వీడియోను నేడు రిలీజ్ చేశారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫస్ట్  సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. 
 
మహాదేవ్‌ స్మరణతో కూడున్న శివ శక్తి పాట బ్రెత్ టేకింగ్ మాస్టర్ పీస్. ఈ సాంగ్ డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్  కంపోజ్ చేసిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ ఆకట్టుపడేస్తున్నాయి. ట్రాక్ పవర్ ఫుల్,  భక్తి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది, అనురాగ్ కులకర్ణి వోకల్స్ డైనమిక్‌గా వున్నాయి. హరిప్రియ సోల్ ఫుల్ వోకల్స్ తో ఆకట్టుకుంది.
 
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్, ఇది మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరిస్తూ, శివునికి పవిత్రమైన బ్యాక్ డ్రాప్ లో కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.
 
'లవ్ స్టోరీ'లో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులుని అలరించాయి.  
 
గ్రాండ్ సెట్స్ ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతుంది. సెట్ డిజైన్, మ్యాజెస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లు కన్నుల విందుగా వున్నాయి. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.