బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2025 (20:46 IST)

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

Venu Swamy
Venu Swamy
సినీ నటులు నాగ చైతన్య, సమంతల విడాకులు గురించి రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై నాగచైతన్య, శోభితల వివాహంపై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చైతూ-శోభిత వివాహంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్​కు బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు. 
 
చై-శోభిత విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ఉమెన్ కమిషన్​కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 
 
ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై స్పందించిన వేణు స్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ ఇబ్బంది కలిగించే హామీ ఇచ్చారు.