గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2024 (18:40 IST)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Venu Swamy
Venu Swamy
Venu Swamy: సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కును తండ్రి భాస్కర్‌కు వేణు స్వామి అందజేశారు. 
 
శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఈ వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని.. అది కూడా తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు. శ్రీతేజ కోలుకుంటాడని తనకు నమ్మకం ఉందన్నారు. అతడు ఖచ్చితంగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు.
 
అయితే పుష్ప హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉండడం వల్ల ఇదంతా జరిగిందని వేణు స్వామి వెల్లడించారు. మీడియాతో వేణు స్వామి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. కాస్తా జాగ్రత్తగా ఉండాలంటూ వేణు స్వామి సూచించారు.

ఇక ఎవరు కావాలని ఏదీ చేయరన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు ఉంటాయన్నారు. కలియుగంలో డబ్బు ఎక్కడుంటే రిస్క్ అక్కడ ఉంటుంది. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడు అందుకే ఇలా జరుగుతుందని చెప్పారు.