1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Massive earthquake in Venezuela; 40,000 missing; cries for help from beneath the rubble

వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు

Massive earthquake in Venezuela
Multi-storey building collapsing in Massive earthquake in Venezuela
ప్రకృతి ప్రకోపిస్తే దాని ఫలితం ఎంతో భయానకంగా వుంటుంది. ఇప్పుడు మరోసారి ప్రకృతి వెనిజులా దేశంపై చూపించింది. వెనిజులా (Venezuela) రాజధాని నగరం కారకాస్ సహా పలు నగరాలు భూకంపం (Earth quake) ధాటికి వణికిపోయాయి. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. మరో 40 వేల మంది గల్లంతైనట్లు చెబుతున్నారు.
 
శిథిలాల క్రింద నుంచి ఆర్తనాదాలు విని తాము నిశ్చేష్టులైపోతున్నట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారు గద్గద స్వరంతో చెబుతున్నారు. వెనెజులా తీర ప్రాంత నగరమైన గువేరాలో పరిస్థితి మరీ దారుణంగా వున్నట్లు చెబుతున్నారు. అక్కడ కనీసం 100కి పైగా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి.
 
ఆ శిథిలాల క్రింద వేలమంది మృత్యువాత పడగా, వేలాదిగా క్షతగాత్రులు చిక్కుకుపోయి వున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 250కి పైగా బహుళ అంతస్తులు పూర్తిగా నేలమట్టమై స్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం