1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Plane with 22 onboard including 4 Indians goes missing in Nepal

నేపాల్‌లో విమానం అదృశ్యం - 22 మంది భద్రతపై ఆందోళన

Plane
నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల భద్రతపై ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. వీరిలో నలుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు. 
 
నేపాల్‌లో విమానాశ్రయం నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఇపుడు ఈ విమానం ఏమందనే విషయం తెలియడం లేదు. 
 
ఈ విమానానికి ఏటీసీతో సంబంధాలు ఉన్న సమయంలో విమానం మౌంట్ ధౌలగిరి వైపు వెళ్లిందని ఏటీసీ అధికారులు అంటున్నారు. మరికొందరైతే ఉదయం 10.35 నిమిషాలకు ఏటీసీని కాంటాక్ట్ చేసిందన్నారు. కానీ, ఆ విమానం ఆచూకీ ఇప్పటివరకు తెలియడం లేదు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆ బాలుడిని ఫ్లైట్‌లోకి అనుమతించని ఇండిగో-రూ.5 లక్షల జరిమానా