గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (20:22 IST)

పైలట్‌ స్పృహ తప్పాడు.. ప్రయాణికుడు విమానం నడిపాడు...

Plane
Plane
విమానం నడుపుతున్న ఓ పైలట్ అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఓ ప్రయాణీకుడి సాయంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడా నుంచి చిన్న సైజు విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఫైలట్ తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన ప్రయాణికుడు కాక్పిట్‌లోని రేడియో ద్వారా సాయం కోరాడు. పైలట్ స్పృహ తప్పి పడిపోయాడని, తన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిపాడు. తనకు విమానం నడపడం అసలు తెలియదని చెప్పాడు.
 
ప్రయాణికుడి సందేశం విన్న ఫోర్ట్ పీర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. సింగిల్ ఇంజిన్ సెస్నా 280 పొజిషన్ గురించి తెలుసా? అని ప్రయాణికుడిని అడిగాడు. అందుకు అతను తనకు ఏమీ తెలియదని.. తన ముందు ఫ్లోరిడా తీరమే కన్పిస్తుందని చెప్పాడు.
 
 అనంతరం ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది.. విమానాన్ని ప్యాసెంజర్ సీటు నుంచే నడిపేలా కంట్రోల్‌ను ఎనేబుల్ చేశారు అలాగే ప్రయాణికుడ్ని శాంతింపజేసి వింగ్స్ లెవెల్ మెయింటెన్ చేయాలని సూచించారు. ప్రయాణీకుడితో స్పష్టంగా మాట్లాడేందుకు అతని ఫోన్ నంబర్ అడిగి.. పాల్మ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో కమ్యూనికేట్ చేయించారు. 
 
అక్కడ 20 ఏళ్ల సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్ పరిస్థితిని తన అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడితో స్పష్టంగా మాట్లాడుతూ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయించాడు. 
 
అనంతరం సహాయక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పైలట్‌ను, ప్రయాణికుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమానంలో పైలట్తో పాటు ఒక్క ప్రయాణికుడే ఉన్నాడని అధికారులు తెలిపారు.