ప్రధాని గారూ... మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎపుడు ఆపుతారు? పాక్ పీఎంకు ప్రశ్న
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెబబాజ్ షరీఫ్ ఇబ్బందికర, చేదు అనుభవం ఎదురైంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్కకు వెళ్లారు. ఈ సమావేశం అనంతరం ఆయన ప్రాగణం నుంచి వెలుపలికి వచ్చారు. అపుడు ఓ విలేఖరి... ప్రధాని గారూ మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎపుడు మానుకుంటారు అంటూ ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురయ్యారు.
ముఖ్యంగా, లష్కరే తోయిబా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ మరోసారి డిఫెన్స్‌లో పడినట్లయింది.
గురువారం ఐరాస ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, 'ప్రధానిగారూ, మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?' అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి షరీఫ్ స్పందించలేదు. అనంతరం, సమావేశం ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు.. "లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?" అని మరోసారి ప్రశ్నించగా, ఆయన మళ్లీ మౌనంగానే వెళ్లిపోయారు.
26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌ను భారత్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద టెర్రరిస్టుగా ప్రకటించింది. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా హఫీజ్ సయీద్ ప్రమేయం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన అనుబంధ చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసులో 8వ నిందితుడిగా అతని పేరును చేర్చింది.
ఈ సంఘటనకు ఒక రోజు ముందే, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ స్ఆర్) సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలని చూడటం వంటివి మానుకుని, అప్పులతో కుదేలైన తమ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని గట్టిగా హితవు పలికింది.
