1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. US sets record for coronavirus cases amid election battle

ఎన్నికల వేళ.. అమెరికాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

US
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు అమెరికాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. నవంబర్4వ తేదీన అమెరికాలో కొత్తగా 99,660 కరోనా కేసులు, 1112 కరోనా మరణాలు సంభవించాయి. 
 
అమెరికాలో మొత్తం ఇప్పటి వరకు 94 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 2.33 లక్షలమంది మరణించారు. ఎన్నికల ప్రచారంలో కరోనా ఉధృతి, కట్టడికి సంబంధించిన అంశాలే కీలకంగా మారాయి. అయితే, ఇప్పుడు జో బైడెన్ అధికారంలోకి వస్తే కరోనాను ఏ మేరకు కట్టడి చేస్తారు అనేది వేచి చూడాలి.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బైడెన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. వైట్ హౌస్‌కు అయన ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నది. బొగ్గుపులుసు వాయువులను కంట్రోల్ చేసి భూతాపం తగ్గించేందుకు 2015లో ప్యారిస్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన సమయంలో డెమోక్రాట్లు అధికారంలో ఉన్నారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సీఎం కార్యాలయ ఉద్యోగి పెళ్లికి వచ్చిన వైఎస్. జగన్ దంపతులు..