శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (17:51 IST)

అరుదైన రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ టాప్ ర్యాంక్ లిస్టులో ముందు వరుసలో ఉన్న యాంకర్ ప్రదీప్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రిలీజ్ చేసిన ఆసియాలోని 400 మంది ఇన్ప్లుయెన్సర్స్ లిస్టులో ప్రదీప్ చోటు సంపాదించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
 
ఇన్ప్లుయెన్సర్స్ లిస్టులో తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చోటు సంపాదించుకున్నారు. మ్యూజిక్ లెజెండ్ రెహమాన్, సోనూ నిగామ్, రహత్ పతే అలీ, జాకీర్ లాంటి ప్రముఖులున్న జాబితాలో మాకు చోటు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ప్రదీప్ తెలిపారు. బుల్లి తెరపై యాంకర్‌గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంటాడు ప్రదీప్.
 
ప్రస్తుతం ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. మున్నా దర్శకత్వంలొ తెరకెక్కిన ఈ సినిమా ఎస్వి ప్రొడెక్షన్ పతాకంపై ఎస్వి బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.