శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (15:48 IST)

రాములమ్మా.. మా మంచి రాములమ్మ... విజయశాంతిపై ప్రశంసల వర్షం!

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శరవేగంగా పుంజుకుంటోంది. అధికార తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలందరినీ తనవైపునకు ఆకర్షిస్తోంది. ఇందులోభాగంగా, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతిని కూడా తమ దళంలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైపోయారు. దీంతో బీజేపీలోకి రాములమ్మ చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి గురించి మీడియా ఎదుట ప్రస్తావించారు. రాములమ్మను బండి సంజయ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. 
 
తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని కొనియాడారు. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. 
 
రాములమ్మ బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.