సంబంధిత వార్తలు
- విశాఖలో దారుణం.. కరోనా బారిన పడి చిన్నారి మృతి
- ప్రాణాలను కాపాడే ఉక్కు కర్మాగారం. ఆలోచించండన్న మెగాస్టార్
- ఆక్సిజన్: మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన విశాఖ స్టీల్ ప్లాంట్, వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా
- కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మృగాడుగా మారిన మనిషి...
- సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు! 12వ తరగతి పరీక్షలు వాయిదా
అమెరికా వీసాలపై కరోనా ప్రభావం.. మే 3 నుంచి అవన్నీ బ్రేక్
అమెరికా వీసాలపై కరోనా ప్రభావం పడింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. యూఎస్ కన్సలేట్ నుంచి జారీ అయ్యే అన్ని సాధారణ వీసా సర్వీసులతో పాటు రొటీన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్, ఇంటర్వ్యూ వేవర్ అపాయింట్‌మెంట్ వీసాలను మే 3 నుంచి నిలిపి వేస్తున్నట్లు కన్సలేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని రకాల సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అపాయింటెమెంట్‌లను ఈ నెల 27 నుంచే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అత్యవసర అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అండ్ వీసా అపాయింట్‌మెంట్‌లు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రకటన తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చినంతవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కన్సలేట్ జనరల్ విడుదల చేసిన ప్రకనటలో వివరించారు.
