శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (14:35 IST)

ప్రేమికుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. అచ్చం సినిమాలా..?

భార్య పరాయి వ్యక్తితో మాట్లాడితేనే భర్తలు మండిపడుతూ వుంటారు. అయితే ఓ భర్త తన భార్యను ఆమె ప్రియుడికే అప్పగించాడు. అతనితో వివాహం కూడా చేసి పెట్టాడు. ఓ భర్త మాత్రం నిజంగా భార్య పాలిట దేవుడయ్యాడు. భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని తెలిసి షాక్ అయ్యాడు. కానీ అర్థం చేసుకున్నాడు. 
 
భార్య ప్రేమించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదేదో అచ్చం సినిమా స్టోరీలా ఉన్నా..నిజం. బీహార్‌లో ఖగారియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.సినిమా స్టోరీలకు గుర్తుచేసే ఈ రీల్ స్టోరీకి బీహార్ రాష్ట్రం వేదికైంది.
 
వివరాల్లోకి వెళితే.. ఖగారియా జిల్లాకు చెందిన సప్న భాగల్‌పూర్‌ జిల్లా సుల్తాన్ గంజ్‌కు చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉత్తమ్ బంధువు రాజ్‌కుమార్‌ను సప్నను కలవక ముందు వరకు వీరి దాంపత్య జీవితం హాయిగానే సాగింది. రాజ్‌కుమార్‌ను చూడగానే సప్న ప్రేమలో పడిపోయింది. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతిని మర్చిపోయి మరీ అతడి ప్రేమలో పడిపోయింది. తప్పని తెలిసినా మనస్సు ఆగలేదు.
 
అతడిని చూడండే ఉండలేకపోయేది. ఈ విషయం తెలిసిన భర్త ఉత్తమ్ భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు. నచ్చ చెప్పాడు. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అని ప్రశ్నించాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలీయని ఉత్తమ్ నిజంగా ఉత్తముడే అయ్యాడు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు చేరింది. దీంతో వాళ్లు జోక్యం చేసుకుని సప్నకు నచ్చజెప్పేందుకు శతవిధాల ప్రయత్నించారు.
 
అయినా.. ఆమె వినలేదు. తప్పని తెలుస్తోంది. కానీ అతడిని విడిచి ఉండలేకపోతున్నానని ఏడుస్తూ చెప్పింది. తాను ఇకనుంచి రాజ్‌కుమార్‌తోనే ఉంటానంటూ సప్న తేల్చి చెప్పేసరికి ఇక ఆ భర్తకు ఇది కుదిరే వ్యవహారం కాదని అనుకున్నాడు. భార్యను రాజ్ కుమార్‌కే ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. 
 
భార్యను రాజ్ కుమార్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అటు అత్తావారి కుటుంబం.. ఇటు తన కన్నవారి కుటుంబ కూడా షాక్ అయ్యారు. ఉత్తమ్ అనుకున్నదే తడవుగా సుల్తాన్‌గంజ్‌లోని దుర్గామాత ఆలయంలో రాజ్‌కుమార్‌తో తన భార్యకు వివాహం జరిపించాడు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.