ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:42 IST)

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు.. మావో పార్టీ

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తుంది మావోయిస్టు పార్టీ... మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారని.. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. 
 
ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతున్నారని.. చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జవాన్లు, పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వెల్లడించారు. జవాన్లు పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారణ వ్యక్తం చేసిందన్నారు.