సంబంధిత వార్తలు
- జియో సంస్థ సేవా భావంతో వచ్చింది... అదీ రాజకీయమేనా?
- తిరుమల: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌కి ప్రయత్నిస్తే జియోమార్ట్ ఓపెన్.. కారణం చెప్పిన టీటీడీ
- భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్.. ఫీచర్స్ సంగతేంటి?
- భార్య నిద్రపోగానే కుమార్తెపై అత్యాచారం.. ఏడాదిన్నరగా ఫిజియోథెరపిస్టు అరాచకం
- రిలయన్స్ కొత్త ఆవిష్కరణ జియోఫోన్ నెక్స్ట్ - వినియోగదారులకు షాక్
జియోకి ఝలక్ ఇచ్చిన ఎయిర్ టెల్- క్యాష్‌బ్యాక్ ఆఫర్
జియోకి ఝలక్ ఇచ్చింది ఎయిర్‌టెల్. దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్స్ ని తీసుకు రావడం జరిగింది. దీనితో ఇది జియోకి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఎయిర్‌టెల్ తమ కస్టమర్స్ కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. అయితే ఈ ఆఫర్ లో భాగంగా రూ.12 వేలలోపు ధరలో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దీనిలో శాంసంగ్, షావోమి, వివో, ఒప్పొ, రియల్‌మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్‌ఫినిక్స్, టెక్నో, లెనొవొ, మోటరోలా వంటి ఫోన్లు వున్నాయి. వీటిలో ఏదైనా ఫోన్ ని కస్టమర్స్ కొనాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఫోన్ కొనుగోలు చేసిన వాళ్లకి రూ.6 వేల క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఫోన్ ని కొనుగోలు చేసిన వారు 36 నెలల పాటు వారి ఎయిర్‌టెల్ నెంబర్‌ను రూ.249 లేదా ఆపైన రీచార్జ్ ప్లాన్లతో ఫోన్ రీచార్జ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే కస్టమర్లకు రెండు విడతల్లో క్యాష్‌బ్యాక్ వస్తుంది. 18 నెలల తర్వాత రూ.2 వేల క్యాష్‌బ్యాక్ వస్తుంది. మిగతా రూ.4 వేల క్యాష్‌బ్యాక్ 36 నెలల తర్వాత చెల్లిస్తారు. అదే విధంగా ఆఫర్‌లో భాగంగా ఫోన్ కొన్న వారికి ఒకసారి స్క్రీన్ రిప్లేస్‌మెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 90 రోజుల్లోగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
