గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

రిలయన్స్ కొత్త ఆవిష్కరణ జియోఫోన్ నెక్స్ట్ - వినియోగదారులకు షాక్

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. వినాయక చవితి రోజున జియో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జియో ఫోన్ నెక్స్ట్’ విడుదల కానున్న నేపథ్యంలోనే కంపెనీ ఈ ప్లాన్లను తొలగించిందని మార్కెట్ నిపుణులు అనుమానిస్తున్నారు.
 
అతి తక్కువ ధరలో 4జీ సేవలు అందించేందుకు ఈ మొబైల్‌ను జియో, గూగుల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అలాగే కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల సహాయార్ధం జియో ప్రకటించిన ‘ఒకటి కొంటే మరొకటి ఉచితం’ (బై 1 గెట్ 1 ఫ్రీ) ఆఫర్‌ను కూడా జియో వెబ్‌సైట్ నుంచి తొలగించారు. 
 
ఈ ఆఫర్ కింద ఒకసారి రీచార్జ్ చేయించుకుంటే, ఆ తర్వాతి రీచార్జ్ ఉచితంగా లభించేది. ఈ ఆఫర్లను జియో తొలగించడంతో.. కొత్త మొబైల్ లాంచింగ్ సమయంలోనే జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్లు కూడా ప్రకటిస్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు, వినాయక చవితి పండుగ ముందు జియో ఫోన్ యూజర్లకు ఆ కంపెనీ షాకిచ్చింది. వినియోగదారులకు అందుబాటులో ఉండే రూ.39, రూ.69 రీచార్జ్ ప్లాన్‌లను తమ వెబ్‌సైట్, యాప్‌ల నుంచి తొలగించింది. 
 
రూ.39 రీచార్జ్‌తో రోజుకు 100 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, భారత్‌లో ఏ నెట్‌వర్క్‌కి అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం యూజర్లకు లభించేది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు.
 
అదే రూ.69తో రీచార్జ్ చేసుకుంటే 14 రోజులపాటు రోజుకు 0.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ సదుపాయం లభించేది. ఈ రెండు ప్లాన్లు ప్రస్తుతం జియో వెబ్‌సైట్ లో, అలాగే మైజియో యాప్‌లో లేవు.