శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:34 IST)

పరాటాకు 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్.. సామాన్యుడికి దూరం

Paratha
భారతీయులు అమితంగా ఇష్టపడే పరాటా ఇక సామాన్యుడికి దూరం కానుంది. పరాటను రోటి, చపాతిలపై విధించే 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్ నుంచి గరిష్ట 18 శాతం శ్లాబ్‌లోకి మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
 
చపాతీ, రోటీ కాంపోజిషన్‌తో పోలిస్తే పరాటా కాంపోజిషన్ భిన్నమైనదని చెబుతోంది. పరాటాపై 18 శాతం గరిష్ట జీఎస్టీ శ్లాబ్‌ను వర్తింపచేయాలని గుజరాత్ ఏఏఆర్ స్పష్టం చేసింది. పరాట అసలు రోటి, చపాతి క్యాటగిరీలోకి రాదని గుజరాత్ అథారిటీ ఆన్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్‌) స్పష్టం చేసింది. 
 
పన్ను విధించే ప్రతిపాదనతో ప్రపంచవ్యాప్తంగా 5000కుపైగా ఉత్పత్తులతో కూడిన ఆరు అంకెల హెచ్ఎస్ఎన్ కోడ్‌లో పరాటా లేదని పేర్కొంది. పరాటా రెడీ టూ ఈట్ ఉత్పత్తి కాదని కూడా చెబుతోంది.