బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:36 IST)

ఇష్ట‌మైన ల‌క్కీ మ‌స్క‌ట్‌పై ఫోజులిచ్చిన ప్రియాంక‌-నేను ముద్దుగా లేనా!

Priyanka Jawalkar
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో న‌టించిన ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచి తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. అయితే డాన్స్‌లో ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాల్సివుంద‌ని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ప‌ర్స‌న‌ల్‌గా త‌న‌కు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ప్రియాంక జవాల్కర్ తెలియ‌జేసింది. అంద‌రూ స్విమ్మింగ్‌, టెన్నిస్ ఇలాంటి ఆట‌లాడుతుంటారు. కానీ నాకు గుర్ర‌పు స్వారీ మ‌రింత ప్రియం. అందులో నాకు బాగా న‌చ్చి గుర్రం పేరు మ‌స్క‌ట్‌. గుర్రం స్వారీ చేస్తే ఎంతో వ్యాయామం మ‌న బాడీకి ద‌క్కుతుంద‌ని పేర్కొంది. తిమ్మ‌రుసు సినిమాలో పొద్దుగా వున్న ఈ భామ ఆ త‌ర్వాత చాలా త‌గ్గింది.
 
ఇదే విష‌య‌మై అడిగితే, తిమ్మ‌రుసులో బొద్దుగానే వున్నానా? ముద్దుగా లేనా? అంటూ చ‌లోక్తి విసిరింది. తిమ్మ‌ర‌సు క‌రోనాకు ముందు చేసింద‌నీ, క‌రోనా త‌ర్వాత చాలా డైటింగ్‌లో ఇలా స‌న్న‌బ‌డ్డాన‌ని పేర్కొంది. త్వ‌ర‌లో ఓ పెద్ద సినిమాలో కనిపించ‌నున్న‌ట్లు చెప్పింది. త‌మిళంలోకూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని తెలియ‌జేసింది.