1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:11 IST)

ఆదాయపు పన్ను రిటర్న్: దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ తేదీ ఆగస్టు 31. 
 
ఈ మార్పు ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ (వీఎస్వీ) చట్టంలోని సెక్షన్ 3 కింద జరిగింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటి పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దీనికోసం తేదీ పొడిగింపు అనివార్యం అయింది. 
 
వివాద్ విశ్వాస్ చట్టం కింద అవసరమైన ఫారం III యొక్క సమస్య, సవరణకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT ఒక ప్రకటనలో తెలిపింది.