1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Apple iPhone X, 8 prices in India compared to US, Dubai, Hong Kong: Here's the difference

ఆ రెండు దేశాల్లో ఐఫోన్ ఎక్స్ చాలా చౌక గురూ..!

ఆపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ మోడళ్ళను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 8, ఐఫోన్ 8+, ఐఫోన్ ఎక్స్ (ఐఫోన్ 10)ను రిలీజ్ చేసింది. వీటిలో ఐపోన్ ఎక్స్ ధర ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో విధమైన ధరకు లభించనుంది.

Apple iPhone X
ఆపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ మోడళ్ళను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 8, ఐఫోన్ 8+, ఐఫోన్ ఎక్స్ (ఐఫోన్ 10)ను రిలీజ్ చేసింది. వీటిలో ఐపోన్ ఎక్స్ ధర ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో విధమైన ధరకు లభించనుంది. భారత్‌లో అయితే, ఏకంగా రూ.లక్ష వరకు పలుకనుంది. కానీ, దుబాయ్, హాంకాంగ్‌లలో రూ.71 వేలు మాత్రమే. 
 
అలాగే, మొబైల్‌ దిగ్గజం యాపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 7, 7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యాపిల్‌ ఐఫోన్‌ 7 ధర ఇప్పుడు రూ.50 వేల దిగువకు వచ్చింది. 
 
గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల పన్ను(జులై 1) అమల్లోకి వచ్చినపుడు కూడా యాపిల్‌ తన స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించింది.
 
కాగా, ఇపుడు ఐఫోన్ల కొత్త ధరల వివరాలను పరిశీలిస్తే... 
ఐఫోన్‌ 7 ప్లస్‌(32జీబీ) 
* పాత ధర రూ.67,300 
* ప్రస్తుత ధర రూ.59,000
 
ఐఫోన్‌ 7 ప్లస్‌(128జీబీ) 
* పాత ధర రూ.76,200 
* ప్రస్తుత ధర రూ. 68,000
 
ఐఫోన్‌ 7 (32జీబీ) 
* పాత ధర రూ.56,200 
* ప్రస్తుత ధర రూ.49,000
 
ఐఫోన్‌ 7(128జీబీ) 
* పాత ధర రూ.65,200 
* ప్రస్తుత ధర రూ.58,000
 
ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌(32జీబీ) 
* పాత ధర రూ.56,100 
* ప్రస్తుత ధర రూ.49,000
 
ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌(128జీబీ) 
* పాత ధర రూ.65,000 
* ప్రస్తుత ధర రూ.58,000
 
ఐఫోన్‌ 6ఎస్‌(32జీబీ) 
* పాత ధర రూ.46,900 
* ప్రస్తుత ధర రూ.40,000
 
ఐఫోన్‌ 6ఎస్‌(128జీబీ) 
* పాత ధర రూ.55,900 
* ప్రస్తుత ధర రూ.49,000గా ఉంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్ 'జనసేన'కు మెగాస్టార్ చిరు పొలిటికల్ కెరీర్‌తో తలనొప్పి...