గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (19:23 IST)

లండన్‌లో "70వ స్వాతంత్ర వేడుకలు"... సిరిసిల్ల చేనేతతో నేసిన జాతీయ పతాకం

లండన్ లోని భారత హైకమీషన్ మరియు భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 70వ స్వాతంత్ర వేడుకల్లో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్(TeNF) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్క

లండన్ లోని భారత హైకమీషన్ మరియు భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన   70వ స్వాతంత్ర వేడుకల్లో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్(TeNF) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించగా ఆ తర్వాత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుండి వేలాదిమంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
 
తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము ప్రధానంగా చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం' అని  'చేనేత వస్త్రాలయం' మద్దతుగా ప్రపంచంలో మొదటిసారిగా అతిపెద్ద భారత జాతీయ పతాకం ప్రవాస గడ్డ మీద ప్రదర్శించడం జరిగింది. సిరిసిల్ల చేనేతే కళాకారులూ, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ చేపట్టిన చేనేతకు చేయూతనిద్దాం కార్యక్రమానికి మద్దతుగా 50 మీటర్ల పొడవుతోనూ 1.3 మీటర్ల వెడల్పుతో ఇండియన్ జింఖానా గ్రౌండ్స్‌లో ప్రదర్శించి భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని పిలుపిచ్చినారు . 
 
భారత హై కమీషనర్ వైకే సిన్హాచే ఆవిష్కరించి, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ చేపట్టిన ఇంతటి వినూత్నమైన ఆలోచనతో  అంతరించిపోతున్న చేనేతే కళాకారులూ చేయూతనిస్తూ మరియు ప్రవాస భారతీయులకి వారి ప్రేమ గౌరవం చాటుకునే విధంగా చేసిన బృహత్తర కార్యక్రమానికి సభ్యులని ప్రత్యేకంగా అభినందించారు.
 
తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు మరియు ఇతర అతిథులకు తెలియజేయాలనే భావనతో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్(TeNF) ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, అలాగే తెలంగాణా సమరయోధుల చిత్రపటాల్ని, తెలంగాణా చారిత్రిక పుస్తక ప్రదర్శన, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంవత్సర కాలంలోని విజయాలతో కూడిన ప్రత్యేక "తెలంగాణా స్టాల్"ని ఏర్పాటు చేయడం జరిగింది.
 
భారత హై కమీషనర్ వైకే సిన్హా గారు, ఎ.ఎస్ రాజన్ (మినిస్టర్ కో-ఆర్డినేటర్, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా మరియు ఇతర ప్రతినిధుల బృందం "తెలంగాణా స్టాల్"ని సందర్శించి, తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ విజయాలు, పర్యాటక ప్రత్యేకత, తెలంగాణా తల్లి ప్రతిమ మరియు ప్రముఖుల పరిచయంతో కూడిన సమగ్ర సమాచారం - ప్రదర్శన చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతనాన్ని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం చాలా స్పూర్తిదాయకంగా ఉందని ప్రసంశించారు. అలాగే గత ఏడాదిగా తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తికల విషయాలను తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు.  
 
స్టాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్రపటాలకు నివాళులర్పించి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతి పథకాన్ని సందర్శించి ప్రవాస తెలంగాణా బిడ్డలు స్టాల్‌ని సందర్శించి, తెలంగాణాకు ప్రత్యేక స్టాల్‌ని చూడటం చాలా గర్వంగా ఉందని, తెలంగాణా ప్రాముఖ్యతను ప్రదర్శిమవుతున్న తీరుని అభినందించారు.
 
మొట్టమొదటిసారి సిరిసిల్ల చేనేతే కళాకారులచే చేయబడ్డ అతిపెద్ద భారత జాతీయ పతాకం ప్రవాస గడ్డ మీద ప్రదర్శించడం హైలైట్‌గా నిలవడం విశేషం. తెలంగాణా రాష్ట్రం నుండి ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నెహ్రూ సెంటర్ నిర్వాహకాలు అభినందించారు.
 
"తెలంగాణా స్టాల్"ని సందర్శించిన అతిథులందరికి మన "హైదరాబాద్ బిర్యానీ" రుచి చూపించడం జరిగింది. ఈ  కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు గంప వేణు, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, అడ్వైసరీ ఛైర్మన్ ప్రమోద్ అంతటి, ప్రధాన కార్యదర్శి గోలి తిరుపతి, ముఖ్యకార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర్ల, సుధాకర్ గౌడ్ రంగుల, ఉమ్మడి కార్యదర్శిలు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మిరియాల, క్రీడా కార్యదర్సులు ఎలేందర్ పిట్టల, స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, మీడియా టీం- శిరీష కే చౌదరి, స్వచ్చంద మరియు సంక్షేమ టీం - మీనాక్షి అంతటి, తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు, జ్యోతిరెడ్డి కాసర్ల, కవితా గోలి, రజిత, ప్రీతి సీక, రమాదేవి తిరునగరి, వాణి రంగు, ఏరియా ఇంచార్జిలు, వెస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్, అజయ్ కుమార్, సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్- శ్రీధర్ నల్ల, వీరు చౌదరి వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్న వారిలో వున్నారు.