శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:22 IST)

మడోన్నాకు ఎంత కష్టమొచ్చింది..?

అమెరికా పాప్ సింగర్ మడోన్నాను ఓ కొరియర్ అవమానించాడు. తన ఇంటికొచ్చిన కొరియర్ తీసుకునేందుకు ఆమె డోర్ ఓపెన్ చేస్తే.. కొరియర్ బాయ్ ఆమెను అవమానించాడు. ఆమె మడొన్నా కాదని అనుమానించిన డెలివరీ సర్వీస్ సంస్థ ఫె

అమెరికా పాప్ సింగర్ మడోన్నాను ఓ కొరియర్ అవమానించాడు. తన ఇంటికొచ్చిన కొరియర్ తీసుకునేందుకు ఆమె డోర్ ఓపెన్ చేస్తే.. కొరియర్ బాయ్ ఆమెను అవమానించాడు. ఆమె మడొన్నా కాదని అనుమానించిన డెలివరీ సర్వీస్ సంస్థ ఫెడెక్స్, ఆమెకొచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో తనకు జరిగిన అవమానంపై మడొన్నా ట్విట్టర్‌కెక్కింది.
 
తానే మడోన్నా అని ఎంత చెప్పినా.. కొరియర్ బాయ్ ఏమాత్రం ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన నెటిజన్లు విభిన్న అభిప్రాయాలను పోస్టు చేశారు. అయితే చాలామంది ఆమెకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. 
 
ఇదో కఠినమైన ప్రపంచమని, ఇక్కడంతేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే.. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ తెచ్చిన తంటా వల్లేనని చెప్తున్నారు. ట్విట్టర్లో ఫెడెక్స్‌పై వార్ మొదలెట్టిన మడోన్నాకు సదరు సంస్థ ట్వీట్ చేసింది. డెలివరీ అడ్రస్‌తోపాటు ఫోన్ నంబరును పంపాలంటూ ట్వీట్ చేశాడు.