ధనుష్... హద్దులు మీరి ప్రవర్తించకు... మడోన్నా సెబాస్టియన్ వార్నింగ్, ధనుష్ మళ్లీ ఏం చేశాడో...?
సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్
సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. దీంతో సుచీలీక్స్ తమిళ్ స్టార్ ధనుష్ పరువుతీసింది.
తాజాగా హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ధనుష్‌కి షాకిచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పవర్ పాండీ'. ఈ చిత్రంలో ధనుష్‌కి జంటగా మడోన్నా సెబాస్టియన్ జతకట్టనుంది. ఈ శుక్రవారం పవర్ పాండీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ ముందే 'పవర్ పాండీ' కి పాజిటివ్ రివ్యూలు వచ్చేశాయి. అయితే, మడోన్నాతో ధనుష్‌కి ఏర్పడిన వివాదం మాత్రం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో ధనుష్ - మడోన్నా సెబాస్టియన్ మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. ఈ గొడవ సందర్భంగా సెబాస్టియన్.. హద్దుల్లో వుండాల్సిందిగా ధనుష్‌ను హెచ్చరించినట్లు సమాచారం. ధనుష్ ప్రవర్తనకి నిరసనగానే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని మడోన్నా సన్నిహితులు అంటున్నారు. ఇకపోతే.. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు.