బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (19:41 IST)

లైవ్ టీవీ షోలో ఓ జంట దుప్పట్లో దూరి ఆ పని కానించేసింది...

రేటింగ్ పెంచుకునేందుకు రియాల్టీ షోల పేరుతో బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హద్దులు మీరిపోతున్నాయి. బుల్లితెర ప్రేక్షకులు ఇంటింటా కుటుంబ సభ్యులేనన్న సంగతి మరిచిపోయి నీలి చిత్రాలను మరిచే రీతిలో సాగుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన తమిళ

రేటింగ్ పెంచుకునేందుకు రియాల్టీ షోల పేరుతో బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హద్దులు మీరిపోతున్నాయి. బుల్లితెర ప్రేక్షకులు ఇంటింటా కుటుంబ సభ్యులేనన్న సంగతి మరిచిపోయి నీలి చిత్రాలను మరిచే రీతిలో సాగుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తాజాగా తెలుగు బిగ్ బాస్ షోలో ఏకంగా నవదీప్ బుగ్గలపై ముద్దు ముద్రలు వేయడం వివాదాస్పదమైంది. ఇలా వివాదాస్పదమైతేనే రేటింగ్ అనే పరిస్థితి వచ్చింది. ఇంకా జబర్దస్త్, పటాస్ వంటి బుల్లితెర కార్యక్రమాల్లో ద్వంద్వార్థాలు నిండిపోయి చెవులు మూసుకునే పరిస్థితి తలెత్తిందని గగ్గోలు వినిపించింది. మన టీవీ షోలు ఇలావుంటే పాశ్చాత్య టీవీ షోలు వీటిని మించిపోయాయి.
 
బ్రిటన్‌లో లవ్ ఐలాండ్ షో అనే ఓ రియాల్టీ షో నడుస్తోంది. ఈ షో నిబంధనలు ఏమిటంటే... ఒకరితో ఒకరికి ఏమాత్రం పరిచయం లేని అమ్మాయిలతో అబ్బాయిలు గడపటం. అది కూడా 5 జంటలు ఒకే బెడ్ పైన పడుకుని యధేచ్చగా ప్రేమించుకోవడం. ప్రేమించుకోవడం అనే దాన్ని ఓ జంట దాటేసింది. టీవీ లైవ్ షో నడుస్తుండగానే ఓ జంట అమాంతం వివస్త్రలుగా మారిపోయి దుప్పట్లో దూరి శృంగారం చేయడం మొదలుపెట్టారు. 
 
ఈ సన్నివేశాన్ని చూసిన బుల్లితెర ప్రేక్షకులు షాక్ తిని తమ పిల్లలు చూడకూడదని వెంటనే టీవీలను ఆఫ్ చేసేశారు. కానీ షో మాత్రం నడిచిపోయింది. దాని కొనసాగింపుగా ఇంకా ఏవేవో తిక్క చేష్టలతో అది కొనసాగుతోంది. దీనిపై లండన్ లో అభ్యంతరం వ్యక్తమవుతున్నా షో నిర్వాహకులు మాత్రం ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. అదేమంటే... తమకు అనుమతి వుంది అని చెప్పేస్తున్నాయి.