ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:46 IST)

డొమినోస్ పిజ్జా ఓరెగాన్ ప్యాకెట్లలో పురుగులు... వీడియో చూడండి

డోమినోస్ పిజ్జా సంస్థ చిక్కుల్లో ఇరుక్కుంది. తాను ఆర్డ‌ర్ చేసిన పిజ్జా సీజ‌నింగ్ ప్యాక్‌లో పురుగులు ఉండ‌టాన్ని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి వాటి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది వైర‌ల్‌గా మార

కేఎఫ్‌సీ చికెన్‌లో ఎలుక కనిపించిందని.. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని ఓ నెటిజన్ ఎలుకతో కూడిన కేఎఫ్‌సీ చికెన్ ముక్కను పోస్ట్ చేశారు. ఈ పోస్టుతో కేఎఫ్‌సీ చికెన్‌ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది. దీనిపై కెఎఫ్‌సీ సంస్థ కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీమేరకు జరిపిన పరిశోధనలో అది చికెన్ ముక్కేనని.. ఎలుక కాదంటూ క్లారిటీ ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో డోమినోస్ పిజ్జా సంస్థ చిక్కుల్లో ఇరుక్కుంది. తాను ఆర్డ‌ర్ చేసిన పిజ్జా సీజ‌నింగ్ ప్యాక్‌లో పురుగులు ఉండ‌టాన్ని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి వాటి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పిజ్జా ప్రియులు డోమినోస్ సంస్థపై తిట్ల దండకం అందుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సెప్టెంబ‌ర్ 8న పిజ్జా ఆర్డ‌ర్ చేశాడు. 
 
పిజ్జాతో పాటు వచ్చే చిల్లీ, ఓరెగాన్ ప్యాకెట్లను కొన్నింటిని అతడు వాడలేదు. మరుసటి రోడు ఆ ప్యాకెట్లను బ్రెడ్ ముక్కలపై వేసుకుని తినాలకున్నాడు. ఈ క్రమంలో వాటిని విప్పి చూస్తే పురుగులుండటాన్ని గమనించాడు. డోమినోస్ వారికి ఈ విష‌యం చెప్పినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో, వీడియో తీసి త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. 
 
రాత్రి పిజ్జా మీద వేసుకుని తిన్న‌ప్పుడు పురుగులను గ‌మ‌నించ‌కుండా అలాగే లాగించేసి వుంటానని.. పిజ్జా ఆర్డర్ వివరాలను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అరోరా పోస్టులకు నెటిజన్లు ఫైర్ కావడంతో పాటు ఈ వీడియోలను 2వేల మంది షేర్ చేయడంతో డోమినోస్ క్షమాపణలు కోరింది. అయితే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అరోరో సిద్ధమైనట్లు తెలుస్తోంది.