రూ.599 రీఛార్జ్‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... 70 రోజుల వ్యాలిడిటీ
తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక ఆకర్షణీయమైన కొత్త ప్లాన్‌ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. రూ.599 రీఛార్జ్‌తో కొత్త ప్లానును రూపొందించింది. బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త రూ.599 ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకున్న వారికి 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో రోజుకు 3జీబీ చొప్పున హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు.
అంటే, ప్లాన్ మొత్తం మీద 210 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. కానీ వేగం తగ్గుతుంది.
డేటాతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. ఇంకా దీంతోపాటే, తక్కువ డేటా వినియోగించే వారి కోసం రూ.51 ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
