1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. BSNL providing free 4G SIM card till December 31: Report

బీఎస్ఎన్ఎల్‌ ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌.. డిసెంబర్ 31 వరకు పొడిగింపు

BSNL
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) ప్రకటించిన ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించింది.

కొద్దిరోజుల కిందట ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ రూ 100కు పైన ఫస్ట్ రీచార్జి కూపన్ పొందాలనుకునే యూజర్లందరికీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఉచిత 4జీ సిమ్‌ను కొత్త కస్టమర్లతో పాటు ఇతర టెలికాం కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారిన వారికీ అందిస్తున్నారు.
 
రూ 100కు మించిన తొలి రీచార్జ్ కూపన్ తీసుకునే వారందరికీ సిమ్ కార్డు చార్జి రూ 20ను కూడా బీఎస్ఎన్ఎల్ ఎత్తివేసింది. ప్రస్తుతం ప్రీ సిమ్ ఆఫర్‌ను కేరళ సర్కిల్‌కు వర్తింపచేస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం సర్కిళ్లకు కూడా పొడిగించనుంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ నుంచి కంపెనీ ఫ్రీ 4జీ సిమ్ ఆఫర్‌ను పొందే వెసులుబాటు ఉంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రసాయన శాస్త్రంలో మరో ఇద్దరికి నోబెల్ పురస్కారం