శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:13 IST)

యూపీ బరిలో ఆప్ : గెలిస్తే ఉచిత విద్యుత్ - 24 గంటలూ సరఫరా!

దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార బీజేపీ మళ్లీ గెలిచేందుకు ఇప్పటి నుంచి సిద్ధమవుతోంది. మొత్తం 403 స్థానాలు ఉన్న యూపీ ఎన్నికల బరిలో ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం ఆ పార్టీ ఓ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు 38 లక్షల కుటుంబాల విద్యుత్‌ బకాయి బిల్లులు మాఫీ చేస్తామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, యూపీలో విద్యుత్‌ ఛార్జీలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత విద్యుత్‌ హామీని నెరవేరుస్తామన్నారు.