1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Elon Musk Attacks Ambani, Rahul Gandhi Joins The Scene

అంబానీనే భారతదేశానికి అసలైన బాసా? ఎలన్ మస్క్ ప్రశ్న.. రాహుల్ ఏమన్నారంటే?

Elon Musk
Elon Musk
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, తన ప్రధాన ఇంటర్నెట్ సేవా సంస్థ అయిన స్టార్‌లింక్ ద్వారా భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. అయితే, ఆయన ప్రవేశాన్ని అడ్డుకునేలా కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయి.
 
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశానికి అభ్యంతరాలు వ్యక్తమవడానికి దారితీసిన పరిణామాలను ఎలాన్ ఇప్పుడు బహిరంగంగా వెల్లడించారు. ఈ విషయంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారిలో ఒకరిగా ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావించారు.
 
స్టార్‌లింక్‌కు 165కి పైగా దేశాల్లో లైసెన్స్ ఉంది. భారత ప్రభుత్వ నిబంధనలు, అవసరాలన్నింటినీ పాటించడానికి తాము ఐదేళ్లుగా కృషి చేశామని.. కానీ ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదు? అంబానీనే భారతదేశానికి అసలైన బాసా?... అని మస్క్ ప్రశ్నించారు. 
 
ఎలన్ నేరుగా అంబానీని ప్రస్తావించడం, ఆయన భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అని వ్యాఖ్యానించడం, టెలికాం రంగంలో ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. జియో ద్వారా టెలికాం రంగాన్ని అంబానీయే శాసిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
ఈ పరిణామంపై భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆసక్తికరంగా స్పందిస్తూ, "భారతదేశానికి స్వాగతం ఎలన్. ఆ మరొక వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి.. అని పేర్కొన్నారు. ఎలన్, రాహుల్ గాంధీల మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇది భారతీయ టెలికాం రంగంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. కొందరు వ్యక్తుల ఆధిపత్యం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించలేకపోతుండటం అక్కడ వాస్తవ పరిస్థితిని సూచిస్తోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
గృహహింసను భరించలేక గొంతుపై కాలితో తొక్కి చంపేశాను.. పోలీసులకు వాంగ్మూలమిచ్చిన మహిళ