1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Google, Facebook make vaccination mandatory for employees returning to office

వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ఫేస్‌బుక్, గూగుల్

Google
అమెరికాలో డెల్టా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అక్కడ భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రజలు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. 
 
కానీ ఇపుడు డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు అమెరికాలోని తమ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్‌ వేయించుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. టీకా తీసుకున్నవాళ్లనే కార్యాలయాలకు అనుమతిస్తామని తేల్చి చెప్పాయి. 
 
గూగుల్ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యాభై శాతం ఉద్యోగులతో శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లోని తమ సంస్థలను 16 నెలల తర్వాత తిరిగి ప్రారంభించింది. అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎనభై శాతానికి పైగా డెల్టా వేరియంట్ కేసులే ఉండడం గమనార్హం.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీలో నిరుద్యోగుల కోసం 1180 పోస్టులు... నోటిఫికేషన్ విడుదల